జంగాం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలుచేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్ర మార్క

Madupa Santhosh CEO
ASF :   జంగాం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలుచేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్
కొమురం భీమ్. ఆసిఫాబాద్: డిజిటల్ న్యూస్ అక్షర తెలంగాణ 
  జైనూర్ జంగాం హనుమాన్ ఘాట్ వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఘన స్వాగతం

బట్టి విక్రమార్కకు శాలువాతో సన్మానించిన డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
జైనూర్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు జైనూర్ మండలం జంగాం హనుమాన్ ఘాట్ వద్ద డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రిని శాలువాతో సన్మానించారు.
అనంతరం బట్టి విక్రమార్క జంగాం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బెల్లయ్యనాయక్, ఎమ్మెల్సీ దండే విట్టల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, నియోజకవర్గం ఇంచార్జ్ శ్యామ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ తదితర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఆదిలాబాద్: ఉట్నూర్: 
దేవ్‌గూడలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: అధికారులకు ఆదేశాలు

        రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దేవ్‌గూడ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామస్థులతో నేరుగా ముచ్చటించిన ఉప ముఖ్యమంత్రి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, అంగన్‌వాడీ కేంద్రం పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించారు.

   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన

       గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి, లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఇళ్ల నిర్మాణాలు నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.

అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ

గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి, అక్కడ పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్యా సదుపాయాలు గురించి వివరాలు తెలుసుకున్నారు. గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు పూర్తిస్థాయిలో అందుతున్నాయా లేదా అని సిబ్బందిని ప్రశ్నించారు.
చిన్నారుల ఆరోగ్యం, పోషణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు.

ప్రజలతో ముఖాముఖి

   గ్రామస్థులతో సమావేశమైన ఉప ముఖ్యమంత్రి, వారి సమస్యలను స్వయంగా విన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందని తెలిపారు.
అధికారులకు స్పష్టమైన ఆదేశాలు

    అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, నిధుల విడుదల, మౌలిక వసతుల కల్పన విషయాల్లో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.
       ఈ పర్యటనలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, పి.ఓ. ఐటిడిఏ యువరాజ్ మర్మాట్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments