మహిళ మిస్సింగ్ కేసు నిందితులు అరెస్ట్ - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.

Madupa Santhosh CEO
 ADB :  మహిళ మిస్సింగ్ కేసు నిందితులు అరెస్ట్ - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.
ఆదిలాబాద్ జిల్లా: డిజిటల్: అక్షరతెలంగాణ
మహిళ మిస్సింగ్ కేసు చేథన – ఆర్థిక వివాదంతో మహిళను హత్య చేసిన ఇద్దరు నిందితుల అరెస్ట్
 మహిళ వద్దనుండి రూ 8.8 లక్షల నగదు తీసుకొని మరియు 8.5 తులాల బంగారం కొదవ పెట్టిన నిందితుడు.
 ఒంటరి మహిళ తన సొంత అవసరాలకు డబ్బును నిందితున్ని తిరిగి అడగగా పథకం ప్రకారం హత్య చేసిన నిందితులు.

 నిందితుల నుండి 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం.
 సాంకేతిక ఆధారాలతో కేసును చేదించిన జిల్లా పోలీసు యంత్రాంగం.

ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ మిస్సింగ్ కేసును జిల్లా పోలీసులు ఛేదించి, అది హత్య కేసుగా తేల్చారు.
 ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
2025 నవంబర్ 29న సమీనా యాస్మీన్ ఫిర్యాదు మేరకు, పిట్టల వాడకు చెందిన తన సోదరి, హత్యకు గురైన మహిళ *సోదరి ఇమ్రానా జబీన్ (39)* నవంబర్ 26 నుంచి కనిపించడం లేదని మావల పీఎస్‌లో కేసు నమోదు చేశారు. విచారణలో ఇమ్రానా జబీన్‌కు ఇంద్రవెల్లికి చెందిన *ఫారూఖ్ ఖాన్* తో ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం ఉన్నట్లు గుర్తించారు.
ఈ మహిళ మిస్సింగ్ కేసును ఎలాగైనా చేదించాలని నిర్ణయం తీసుకున్న జిల్లా పోలీసులు సీఐ కె. స్వామి నేతృత్వంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టి, సాంకేతిక ఆధారాలను సేకరించి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని విచరించడం జరిగిందని, ఖచ్చితమైన ఆధారాలతో 2026 జనవరి 14న దస్నాపూర్ కూరగాయల మార్కెట్ సమీపంలో ప్రధాన నిందితుడు మొహమ్మద్ ఫారూక్ ఖాన్ (A1) మరియు అతని డ్రైవర్ బస్సీ రమేష్ (A2) లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. 
విచారణలో నిందితులు హత్యకు పాల్పడ్డట్లు ఒప్పుకున్నారు అని తెలిపారు.

మృతురాలుకు A1 సుమారు రూ.8,80,000 నగదు మరియు 8.5 తులాల బంగారం బాకీ ఉండగా, తన సొంత అవసరాల నిమిత్తం ఆమె డబ్బులు తిరిగి అడగడంతో డబ్బులు తిరిగి ఇచ్చేందుకు ఇష్టపడని నిందితుడు, హత్యకు కుట్ర పన్నినట్లు తెలిపారు.

 2025 నవంబర్ 26న పిట్టలవాడలోని ఆమె ఇంట్లో A2 కాళ్లు పట్టుకోగా, A1 ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.

హత్య అనంతరం మృతదేహాన్ని అద్దెకు తీసుకున్న ఎర్టిగా కారులో మహారాష్ట్రలోని సర్కాని ఘాట్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, రోడ్డు కల్వర్ట్ సమీపంలో గుంతలో పూడ్చినట్లు వెల్లడించారు.

నిందితుల సమాచారంతో రెవెన్యూ, వైద్య శాఖల సమన్వయంతో తహసీల్దార్ సమక్షంలో శవాన్ని వెలికి తీసారు. శరీరం కుళ్లిపోయినప్పటికీ, మృతురాలి దుస్తుల ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించడంతో. డీఎన్ఏ పరీక్షల కోసం నమూనాలు సేకరించారు.

మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన ఈ కేసును ఇప్పుడు బీఎన్‌ఎస్ సెక్షన్ 103 (హత్య), 238 3(5) కింద మార్చి, ఇద్దరు నిందితులను న్యాయస్థానానికి హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.

ఈ కార్యక్రమంలో శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, మావల సీఐ కర్రె స్వామి, ఎస్సైలు మధుకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments