ఆదిలాబాద్: అక్షరతెలంగాణ
బేల మండలం సైద్ పూర్.గుడుంబా పై స్పెషల్ డ్రైవ్. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం.
గంజాయి, మదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచన.
ఆసాంఘిక కార్యకలాపాలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవు.
ప్రజల సంరక్షణ, భద్రతకై కమ్యూనిటీ కాంటాక్ట్ ల నిర్వహణ
30 మంది సిబ్బందితో నిర్బంధ తనిఖీలు
ప్రజల రక్షణ, సంరక్షణ సక్రమంగా నిర్వహించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ అండ్ సెర్చ్) లను నిర్వహించడం జరుగుతుందని జైనథ్ సిఐ జి శ్రావణ్ తెలిపారు. బేల మండలం సైద్ పూర్ గ్రామంలో ఉదయం 50 మంది సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ ను నిర్వహించడం జరిగింది. గుడుంబా పై స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ డ్రైవ్ లో 30 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు 12 మందిపై బేల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ గుడుంబా, గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా ఉండాలని సూచించారు. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ ఉండాలని ఎలాంటి గృహహింస చర్యలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించి సోషల్ మీడియా పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని తెలిపారు. సి సి ఎస్ సి ఐ చంద్రశేఖర్, బేల ఎస్సై ఎల్ ప్రవీణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments