ఉద్యోగ కల్పన కల సహకారం చేసుకున్న యువతీ, యువకులు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

Madupa Santhosh CEO

ADB :   ఉద్యోగ కల్పన కల సహకారం చేసుకున్న యువతీ, యువకులు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. 
ఆదిలాబాద్ : డిజిటల్ న్యూస్: అక్షర తెలంగాణ 

 67 కంపెనీలలో 4000 వరకు ఉద్యోగ అవకాశాలు.
 వివిధ రంగాలలో 2100 ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులు.

 7500 వరకు పాల్గొన్న నిరుద్యోగ యువతి యువకులు.

 భారీగా పాల్గొన్న నిరుద్యోగ యువతీ యువకులు.
 చదువుకు తగ్గట్టు ఉద్యోగం.

 సంతోషం వ్యక్తం చేసిన వందలాదిమంది నిరుద్యోగులు.
 పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ప్రభాకర్ రావు,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మా బొజ్జు పటేల్, ఐటిడిఎ పిఓ యువరాజ్ మర్మట్, ఇతర అధికారులు.

 13 వేల నుండి 45 వేల వరకు వేతనం ఉన్న ఉద్యోగాలకు ఎంపికైన యువత.

 ఐటీ, హెల్త్ కేర్,బ్యాంకింగ్, నాన్ ఐటీ, ఆటోమొబైల్, నర్సింగ్, మార్కెటింగ్, డ్రైవింగ్, సెక్యూరిటీ, టెక్నికల్, ఫార్మ, హెచ్ఆర్ మరియు ఎయిర్ పోర్ట్ రంగాలలో ఉద్యోగాలు.

 మధ్యవర్తులు లేని ఉద్యోగ కల  సాకారం చేసిన జిల్లా పోలీస్ శాఖ కృతజ్ఞతలు తెలియజేసిన యువతి, యువకులు.

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దూరదృష్టితో జిల్లా అభివృద్ధికి తోడ్పడుతూ దాదాపు నాలుగువేల ఉద్యోగాల కల్పనకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో *మెగా జాబ్ మేళా* కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలోని 67 కంపెనీలు పాల్గొని యువతీ, యువకులకు ఉద్యోగాలను కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 7500 యువత పాల్గొని జాబ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఐటీ కంపెనీల నుండి ఉద్యోగ అవకాశాలు, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఆటోమొబైల్, నర్సింగ్, మార్కెటింగ్, డ్రైవింగ్, సెక్యూరిటీ, టెక్నికల్, ఫార్మ, హెచ్ఆర్ మరియు ఎయిర్ పోర్ట్ ల నందు 13 -40 వేల
రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాలను యువత సాధించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎక్కడ ఉద్యోగం వచ్చిన యువత చేజార్చుకోవద్దని, వచ్చిన ఉద్యోగాన్ని చక్కగా నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగాలని యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెదలాలని తెలిపారు. చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చిన వారు ముఖ్యంగా అంచలంచలుగా ఎదిగే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని సుమారుగా 2100 ఉద్యోగాలను కల్పించడం జరిగిందని తెలిపారు. ఎటువంటి బ్రోకర్లు లేకుండా మధ్యవర్తులు లేకుండా ఉద్యోగం సాధించడంతో చాలా సంతోషం, ఆనందకరమని, ఉద్యోగం సాధించిన యువతి యువకులు తమ కృతజ్ఞతలు జిల్లా పోలీసు శాఖకు తెలియజేశారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి కే ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మా బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్, అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, ఎఎస్పి లు పి మౌనిక, రుత్విక్ సాయి కొట్టే, డిఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, కమతం ఇంద్ర వర్ధన్, పోతారం శ్రీనివాస్, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, ముఖ్యంగా 24*7 జాబ్ ఏజెన్సీ నిర్వాహకులు పుల్లూరి చందర్, స్కిల్ ట్రైనర్ రఘురామరాజు, 67 కంపెనీల ప్రతినిధులు, సిబ్బంది, ప్రజలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Comments