ప్రస్తుత సమాజంలో మహిళలదే కీలకపాత్ర: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

Madupa Santhosh CEO
NRML :మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ప్రస్తుత సమాజంలో మహిళలదే కీలకపాత్ర: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
నిర్మల్: డిజిటల్ న్యూస్: అక్షర తెలంగాణ: 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో మహిళల పాత్రను కొనియాడుతూ, వారికి మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడూతూ, నేటి సమాజంలో మహిళలు అబలలు కాదని, సబలులుగా అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. విద్య ద్వారా మాత్రమే మహిళా సాధికారత సాధ్యమవుతుందని, ప్రతి మహిళ తన హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మహిళలు ఉన్నత స్థానాలను అధిరోహించడం గర్వకారణమని పేర్కొన్న కలెక్టర్, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళల అభివృద్ధికి పురుషుల సహకారం కూడా అవసరమని, సమాన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మహిళలు ఉద్యోగ, కుటుంబ బాధ్యతలతో పాటు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలని సూచించిన కలెక్టర్, విజయవంతమైన మహిళలు ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. 
జిల్లా యంత్రాంగం తరఫున మహిళా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని, పని ప్రదేశాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
     జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ఉన్నత స్థానాలకు చేరుకున్న విద్యార్థులు, ఉద్యోగులు తమ విజయగాథలను ఈ సందర్భంగా పంచుకున్నారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులను కలెక్టర్ ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారి వినూత్న, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఖజానా శాఖ అధికారి సరోజ, ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.


నిర్మల్: డిజిటల్ న్యూస్ : అక్షర తెలంగాణ: 


   చిత్తడి నేలలతో పర్యావరణ ప్రయోజనాలు:   జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
    చిత్తడి నేలలతో (వెట్ ల్యాండ్స్) అనేక పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. 
  జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపుకు సంబంధించి, సంబంధిత అధికారులతో కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో, బుధవారం సాయంత్రం కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న చిత్తడి నేలలను శాస్త్రీయంగా గుర్తించి, వాటిని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో భాగంగా అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి, సంయుక్తంగా క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించాలని సూచించారు. చిత్తడి నేలల వల్ల భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా, జీవవైవిధ్యం పెంపొందుతుందని, వీటిని గుర్తించి, కాపాడుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. జిల్లాలో గుర్తించిన చిత్తడి నేలలను కేవలం పర్యావరణ కోణంలోనే కాకుండా, పర్యాటక కేంద్రాలుగా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉందని, తద్వారా జిల్లా అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.
          ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, అటవీ శాఖాధికారి (డిఎఫ్ఓ) సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీవో రత్నకళ్యాణి, డిఆర్డిఓ విజయలక్ష్మి, డిపివో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments