అర్హులైన ప్రతిఒక్కరి ఓటు హక్కును కాపాడే బాధ్యత కాంగ్రెస్ నాయకులదే - డి సి సి అధ్యక్షులు డా: నరేష్ జాదవ్

Madupa Santhosh CEO
ADB: అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల దే -డీసీసీ అధ్యక్షులు డా: నరేష్ జాదవ్  
ఆదిలాబాద్: అక్షర తెలంగాణ 
 కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను కాపాడుకునే బాధ్యత నాది మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానది డీసీసీ డా నరేష్ జాదవ్  

జిల్లాలో కొనసాగుతున్న SIR ఫేజ్–2 ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ అన్నారు.
శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రత్న గార్డెన్‌లో బోత్ & ఆదిలాబాద్ నియోజకవర్గల కాంగ్రెస్ పార్టీ BLA–2లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ కోట్నాక్ తిరుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, BLA–2లు, మండల, పట్టణ, వార్డు అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా. నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని అన్నారు. తాను గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని, పార్టీ సిద్ధాంతాలు, నియమాలకు కట్టుబడి పనిచేసినందుకు పార్టీ తన సేవలను గుర్తించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిందని తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలు, నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలతో పాటు ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, రేవంత్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు కష్టపడి పనిచేయాలని అన్నారు.
SIR ఫేజ్–2 ప్రక్రియలో అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటు హక్కు కూడా కోల్పోకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డా. నరేష్ జాదవ్ సూచించారు.

ప్రతి ఓటరు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అర్హులైన ఓటర్లు అవసరమైన పత్రాలను సమర్పించుకోవడం, ఓటరు జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవడం వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు పూర్తిస్థాయిలో సహకరించాలని తెలిపారు.
ఏదైనా కారణంతో అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడినట్లయితే, సంబంధిత నిబంధనల ప్రకారం వారు తమ అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించుకునేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహకరించాలని సూచించారు.

ప్రత్యేకంగా దళితులు, మైనారిటీలు, పేదలు, అణగారిన వర్గాలకు చెందిన అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా కాంగ్రెస్ కార్యకర్తలు మరింత అప్రమత్తంగా పనిచేయాలని అన్నారు.
ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది వంటిదని డా. నరేష్ జాదవ్ అన్నారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేలా చూడటం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమైన అంశమని తెలిపారు.

SIR ప్రక్రియలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తన బాధ్యతను గుర్తించి నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగితే కాంగ్రెస్ పార్టీ సహించబోదని హెచ్చరించారు. ఓటు హక్కు విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం, సంస్థాగత బలోపేతంలో భాగంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, BLAలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు డా. నరేష్ జాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయంం బాపూరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, బోత్ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, ఆత్మ కమిటీ చైర్మన్ గీమ్మ సంతోష్ రావు, జైనథ్ మార్కెట్ చైర్మన్ అశోక్ రెడ్డి, ఇచ్చోడ మార్కెట్ చైర్మన్ సత్యవతి కోటేష్, జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు అసిఫ్ ఖాన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఖిజార్ పాషా, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శాంతన్ రావు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ OBC విభాగం అధ్యక్షులు అంబకంటి అశోక్, జిల్లా కాంగ్రెస్ SC విభాగం అధ్యక్షులు పరమేశ్వర్, జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగం అధ్యక్షులు సయ్యద్ షాహిద్, NSUI నాయకులు కపిల్, ST సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సెద్మకి ఆనంద్ రావు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసుల చంటి, యూత్ కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ అధ్యక్షులు నహీద్, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి అల్లూరి అభిషేక్ రెడ్డి, సేవాదళ్ అధ్యక్షులు మోతిరామ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్, బ్రిజులాల్, బాబన్న, జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ఇంచార్జ్ గౌలి సంజీవ్ కుమార్, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు బెజ్జంకి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ BLAలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
Comments