అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ – నాలుగు వెంటిలేటర్లు స్వాధీనం- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Madupa Santhosh CEO
ADB: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ – నాలుగు వెంటిలేటర్లు స్వాధీనం- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్: అక్షర తెలంగాణ 

రిమ్స్ ఆసుపత్రిలో రూ 32 లక్షల విలువ చేసే వెంటిలేటర్ల చోరీ కేసు ఛేదన , టెక్నీషియన్ల ముసుగులో వచ్చి వెంటిలేటర్ల చోరీ
ముగ్గురిపై కేసు నమోదు ఇద్దరి అరెస్ట్,

32 లక్షల విలువైన వెంటిలేటర్లతో పాటు ఇతర వైద్య పరికరాలు రికవరీ 
చోరీ చేసిన వైద్య పరికరాలను కొనుగోలు చేసిన హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అరెస్ట్
మహారాష్ట్ర, నిజామాబాద్ ప్రాంతాల్లోనూ గతంలో చోరీలకు పాల్పడిన నిందితులు
 సజ్జన్ బసంత్ మోతే తండ్రి బాసన్, నివాసం మహంకాళి వార్డు, చంద్రపూర్, మహారాష్ట్ర.(అరెస్ట్)
అభిజిత్ – మహారాష్ట్ర, చంద్రపూర్.(పరారీ) మేడం కొండా రెడ్డి , తండ్రి చిన్నమాల కొండారెడ్డి, నివాసం ప్రగతి నగర్, హైదరాబాద్.(అరెస్ట్)
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు అత్యవసర చికిత్స అందించే వెంటిలేటర్లను చోరీ చేసిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి, చోరీకి గురైన వెంటిలేటర్లతో పాటు ఇతర వైద్య పరికరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే.
గత నెల 30వ తేదీన మహారాష్ట్ర చంద్రపూర్‌కు చెందిన సజ్జన్ బాసన్ మోతే, అభిజిత్ అనే ఇద్దరు వ్యక్తులు టెక్నీషియన్లుగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోకి ప్రవేశించారు. రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో వారి ప్రాణ హాని కలిగించే విధానంగా ఆసుపత్రిలోని రెండో అంతస్తులో ఉన్న RICU, SAARI వార్డులలో రోగులకు అత్యవసర చికిత్స అందించే నాలుగు పనిచేసే మైండ్ రే బ్రాండ్ కు చెందిన వెంటిలేటర్లను చోరీ చేసి మహారాష్ట్రకు తరలించారు.

అనంతరం చోరీ చేసిన వైద్య పరికరాలను విక్రయించేందుకు హైదరాబాద్‌కు చెందిన మెడికల్ ఎక్విప్మెంట్ సేల్స్ అండ్ సర్వీస్ వ్యాపారి కొండా రెడ్డిని సంప్రదించారు. దొంగిలించిన వస్తువులని తెలిసి కూడా కొనుగోలు చేసేందుకు అంగీకరించిన కొండల్ రెడ్డి, వాటిని కొనుగోలు చేయడానికి చంద్రపూర్‌కు వచ్చాడు. వైద్య పరికరాలను కారులో పెట్టుకుని హైదరాబాద్‌కు వెళ్తుండగా, ఆదిలాబాద్ ఆర్టీవో కార్యాలయం సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులను గమనించిన నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితులు.. గతంలో మహారాష్ట్రలోని చంద్రపూర్ వద్ద గల నాగ్భీడ్, వని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ వైద్య పరికరాలను చోరీ చేసినట్లు వెల్లడించారు. వీరు దొంగిలించిన వైద్య పరికరాలను హైదరాబాద్‌కు చెందిన కొండా రెడ్డికి విక్రయించినట్లు విచారణలో తేలింది. పోలీసులు నిందితుల వద్ద నుండి రిమ్స్ ఆసుపత్రిలో చోరీ చేసిన నాలుగు వెంటిలేటర్లు, నిజామాబాద్ ఆసుపత్రిలో చోరీ చేసిన ఒక వెంటిలేటర్, ఒక NST మిషన్, మహారాష్ట్ర వని ఆసుపత్రిలో చోరీ చేసిన ఫీటల్ మానిటర్, చంద్రపూర్ నాగభీడ్ ఆసుపత్రిలో చోరీ చేసిన డయాథెరపీ మిషన్‌తో పాటు నగదు, రూ 1 లక్ష నగదు, సెల్ ఫోన్లు, ఒక బైకు, కారు స్వాధీనం చేసుకున్నారు. రోగుల ప్రాణాలకు అవసరమైన వైద్య పరికరాలను చోరీ చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వైద్య పరికరాల కొనుగోలు, విక్రయాల విషయంలో అనుమానాస్పద లావాదేవీలు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలి. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన  సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

సిసి టివి కెమెరాలు ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేయాలని తెలిపారు. సీసీటీవీ కెమెరాల వల్ల నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. సీసీటీవీ కెమెరాలు ఉన్న ప్రదేశాలలో దొంగలు దొంగతనాలు చేయడానికి వెనుకడతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సై అఖిల్, ఆర్ఎస్ఐ గోపికృష్ణ, సిబ్బంది హెచ్ సి రమణ, క్రాంతి, త్రిశూల్, అఖిల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments