ఆదిలాబాద్: అక్షర తెలంగాణ
ఆదిలాబాద్ పట్టణం లోని ఖానాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం క్యాన్సర్ అవేర్నెస్ సెషన్ నిర్వహించారు.. ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో జరిగింది . ప్రముఖ ఆంకాలజిస్ట్ డా.జక్కుల శ్రీకాంత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్యాన్సర్ కారకాలు,పరీక్షలు మరియు నిర్మూలన గురించి వివరించారు. అతి వేగంగా ప్రబలుతున్న నోటి క్యాన్సర్ నిర్మూలన మరియు చికిత్స గురించి కూలంకుషంగా వివరించారు.
ఆదిలాబాద్ లో పెరుగుతున్న క్యాన్సర్ కేసులకు,క్యాన్సర్ బారిన పడిన పేద గ్రామీణ మరియు గిరిజన ప్రజలకు ఎంతో నేర్పు మరియు ఓర్పుతో చికిత్స చేస్తున్న ఆదిలాబాద్ బిడ్డ డా.జక్కుల శ్రీకాంత్ కి లయన్స్ క్లబ్ తరఫున అభినందనలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నూటెంకి సత్యనారాయణ,కార్యదర్శి చొప్పదండి రమేష్ బాబు, కోశాధికారి ఎల్ల ఆనంద్ రెడ్డి,నిఖిని వర్మ ,సీనియర్ లయన్ లీడర్లు రమాకాంత్ ,బండారి దేవన్న ,బెజ్జంకి రవీంద్ర , భూపతి గౌడ్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్ ,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments