ADB : ఆదివాసీ దండారి ,గుస్సాడి ఉత్సవాల లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్
ఆదిలాబాద్: అక్షర తెలంగాణ
ముఖ్య అతిథులుగా డీసీసీ డా. నరేష్ జాదవ్ , ఎస్పి అఖిల్ మహాజన్ ,ఆడ్ ఎస్పి రూత్విక్ సాయి కొట్టె ,మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి , పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని సోయంగూడా గ్రామంలో నిర్వహించిన ఆదివాసీల సాంప్రదాయ దండారి (గుస్సాడి) ఉత్సవాల్లో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ పాల్గొని సందడి చేశారు. ఆదివాసీ సంప్రదాయ నృత్యాల్లో స్వయంగా పాల్గొని గిరిజనులతో కలిసి నృత్యం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.
విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, కళలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లా గిరిజన పల్లెలు ఆదివాసీ సంస్కృతికి పుట్టినిల్లుగా నిలుస్తున్నాయి. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయ కళలను ఆదివాసీ గూడాలు నేటికీ ఎంతో వైభవంగా కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాయి.
ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద ఆదివాసీ పండుగగా పేరుగాంచిన దండారి (గుస్సాడి) ఉత్సవాలు గిరిజనుల జీవన విధానానికి, ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. డప్పుల మోతలు, సంప్రదాయ వేషధారణలు, ప్రత్యేక నృత్యాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు మాట్లాడుతూ.
దండారి (గుస్సాడి) ఉత్సవాలు కేవలం పండుగ మాత్రమే కాదని, ఆదివాసీల తరతరాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. మన ఆదివాసీ కళలు, ఆచారాలు, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు గిరిజన కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
సోయంగూడా గ్రామంలో గిరిజన సోదరులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, ఆదివాసీ సంప్రదాయాలకు ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని డా. నరేష్ జాదవ్ వెల్లడించారు.
జిల్లా సర్పంచుల పోరం అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్ , గుడిహత్నూర్ మండల అధ్యక్షులు తొడసం దౌలత్ రావు , మాజీ మండల అధ్యక్షులు అంకత్ రవి , మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాగ్ నాథ్ అప్ప , మండల ఉపధ్యక్షులు మొయితే మారుతీ , మండల స్పోక్స్ పర్సన్ ఆడే జైపాల్ , మాజీ బోరిగాం ఎంపీటీసీ ప్రవీణ్ రెడ్డి, బోథ్ మండల ఉపాధ్యక్షులు రఫీక్ , బోథ్ ఏ ఎం సి డైరెక్టర్ షేక్ ఇసుబ్, పి ఏ సి మెంబర్ సత్యనారాయణ , కోట్నాక్ గణేష్, పవార్ రాజు , జాదవ్ శ్రీకాంత్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆదివాసీ నాయకులు గ్రామ పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.
Comments